గురువారం 25 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 27, 2021 , 01:49:47

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

  • వీధి వీధినా మువ్వన్నెల రెపరెపలు
  • ఆయా చోట్ల జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్‌
  • ప్రజాప్రతినిధులు, అధికారుల హాజరు

జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటా యి. వీధి వీధినా మువ్వన్నెల జెండా రెపరెపలా డింది. కోటపల్లిలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు మార్‌, మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్‌లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రిలో జడ్పీ చైర్‌పర్స న్‌ నల్లాల భాగ్యలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ప్రభుత్వ, సింగరేణితోపాటు జీపీ కార్యాలయాల్లో పతకాన్ని ఎగురవేశారు. 

మంచిర్యాల అర్బన్‌, జనవరి 26 : జిల్లా కేంద్రం లో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాంధీ పార్కు వద్ద మం చిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఐబీలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం జాతీయ జెండా ఎగురవేశారు. డీఈవో కార్యాలయంలో డీఈవో వెంకటేశ్వర్లు, డీఐఈవో ఆఫీస్‌ వద్ద డీఐఈవో శైలజ, డిపోలో డీఎం మల్లేశయ్య, డీఏవో కార్యాలయంలో డీఏవో వినోద్‌ కుమార్‌, మార్కె ట్‌ కమిటీలో చైర్మన్‌ పల్లె భూమేశ్‌ జాతీయ జెం డాను ఆవిష్కరించారు. సింగిల్‌ విండో కార్యాల యం వద్ద చైర్మన్‌ సందెల వెంకటేశ్‌, ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్‌ అరవింద్‌, డీఎం అండ్‌ హెచ్‌వో కార్యాలయం వద్ద డీఎంఅండ్‌ హెచ్‌వో నీరజ, మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఏడీ సత్యనారాయణ, జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో డీవీఏహెచ్‌వో శంకర్‌, వెటర్నరీ దవాఖాన వద్ద శంకర్‌ లింగం, మార్క్‌ఫెడ్‌ కార్యాలయం వద్ద డీఎం గౌరీ నాగేశ్వర్‌ రావు, డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద డీఆర్డీవో శేషాద్రి, కార్మిక శాఖ కార్యాలయం వద్ద జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద సీఐ నరేందర్‌, గ్రంథాలయంలో ఆ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ స్వరూపారాణి, డిగ్రీ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చక్రపాణి, అన్ని ప్రభుత్వ పాఠశాలల వద్ద హెచ్‌ఎంలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

గర్మిళ్ల, జనవరి 26 : డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌లో సీఐ ముత్తి లింగయ్య, తహసీల్‌ కార్యాల యంలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

మంచిర్యాల ఏసీసీ, జనవరి 26 : జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ అధికారి శివా నీ డోగ్రా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఉత్త మ ఉద్యోగులు రమాదేవి డీఆర్వో (బెల్లంపల్లి), నహీద పర్వీన్‌ ఎఫ్‌ఎస్‌వో (జన్నారం), శంకర్‌ ఎఫ్‌బీవో (బెల్లంపల్లి), కుమారస్వామి ఎఫ్‌బీవో (జన్నారం), మక్బుల్‌ షేక్‌ ఎఫ్‌బీవో (జన్నారం) కు ఒకొక్కరికీ రూ.10,000తోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌), జనవరి 26 : జీఎం ఆఫీస్‌లో జీఎం కే లక్ష్మీనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్‌, స్కౌట్స్‌ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ కార్మికులను జీఎం లక్ష్మీనారాయణ, సరళాదేవి, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి సన్మానించారు. ఓసీపీపై పీవో పురుషోత్తంరెడ్డి, ఎస్సార్పీ 3గనిపై మేనేజర్‌ రవికుమా ర్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌, ఆర్కే 6గుడిసెలు అంబేద్కర్‌ భవన్‌లో అధ్యక్షుడు స్వామి, అంబాల రాజేశ్‌, ఎర్ర ఎల్లయ్య జాతీయ పతకాన్ని ఎగుర వేశారు.  

బెల్లంపల్లిటౌన్‌, జనవరి 26 : ఎమ్మెల్యే క్యాంప్‌, టీబీజీకేఎస్‌ కార్యాలయం, తాపీ సంఘం భవ నంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెం డాను ఆవిష్కరించారు. జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో జడ్జి హిమబిందు, ఆర్డీవో కార్యాల యం వద్ద ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్‌ కార్యా లయంలో తహసీల్దార్‌ కుమారస్వామి, మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ గడ్డం పావని కల్యాణి, 11వ వార్డులో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జక్కుల శ్వేత, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ వెంకటేశ్‌, జూనియర్‌ కళాశాలలో ప్రిన్సి పాల్‌ అంజయ్య జెండాను ఎగురవేశారు.

చెన్నూర్‌, జనవరి 26 : ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎంపీపీ మంత్రి బాపు, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జ్యోతి,  మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వేముల మల్లేశ్‌తో పాటుగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పలు కూడళ్లల్లో పలు పార్టీల నాయకులు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 

హాజీపూర్‌, జనవరి 26 : కలెక్టర్‌ కార్యాలయం లో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి జాతీయ జెండా ను ఎగురవేశారు. మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీడీవో అబ్దుల్‌ హై, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జమీర్‌, ఏవో కార్యాలయం లో ఏవో రజిత, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ చంద్రశేఖర్‌, 13వ గుడిపేట ప్రత్యేక తెలంగాణ పోలీస్‌ బెటాలియన్‌లో కమాండెంట్‌ శ్రీనివాస్‌, మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్‌, టీఎన్‌జీవో కార్యాలయంలో ఆ సం ఘం అధ్యక్షుడు శ్రీహరి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌ రవికాంత్‌ జెండాను ఎగుర వేశారు. డీపీవో కార్యాలయంలో డీపీవో నారాయ ణ రావు జెండాను ఆవిష్కరించారు. 

దండేపల్లి, జనవరి 26 : తహసీల్‌ కార్యాలయం లో తహసీల్దార్‌ హన్మంతరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, సహకార సం ఘం కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కాసనగొట్టు లింగన్న, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం ప్రవీణ్‌, గూడెం ఆలయంలో ఈవో వడ్లూరి అనూష, జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం అప్పాల మనోహర్‌, ఏవో ఆఫీస్‌లో ఏవో అంజిత్‌ కుమార్‌, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చుం చు శ్రీనివాస్‌ జెండా ఎగురవేశారు. వివిధ గ్రామా ల్లో సర్పంచ్‌లు పతాకాన్ని ఎగురవేశారు.  

లక్షెట్టిపేట రూరల్‌, జనవరి 26 : లక్షెట్టిపేట అంబేద్కర్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే దివాకర్‌ రావు జాతీయ జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, పార్టీ కార్యాలయాలతోపాటు పలు చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకలు నిర్వహించారు. 

సీసీసీ నస్పూర్‌, జనవరి 26 : నస్పూర్‌ కాలనీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకేఎస్‌ కార్యాల యం వద్ద ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, సీసీసీ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కుమారస్వామి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రాజలింగు, తహసీల్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ శేఖర్‌, సిటి కేబుల్‌ ఆఫీస్‌ వద్ద బ్రైట్‌వే డైరెక్టర్‌ మహ్మద్‌ మౌలానా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 

కోటపల్లి, జనవరి 25 : మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. జాతీ య జెండాకు వందనం చేశారు. తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రామచంద్రయ్య, ఎంపీడీ వో కార్యాలయంలో ఎంపీడీవో భాస్కర్‌, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రవి కుమార్‌, ఏవో కార్యాలయం లో ఏవో మహేందర్‌, పీఏసీఎస్‌లో చైర్మన్‌ సాం బాగౌడ్‌, గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ రాగం రాజక్క, పీహెచ్‌సీలో డాక్టర్‌ సత్యనారాయణ, మండల విద్యా వనరుల కేంద్రంలో తిరుపతి రెడ్డి, పశువైద్యశాలలో పశువైద్యాధికారి పవన్‌కుమార్‌, స్త్రీశక్తి భవనంలో ఏపీఎం రాజన్న, జడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్‌ఎం బానాల లక్ష్మీనారాయణ, ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం విజయసాగర్‌, కస్తూర్బా పాఠశాలలో హరిత, మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపా ల్‌ లక్ష్మారెడ్డి, ప్రాథమిక పాఠశాలలో అంజన్‌కుమార్‌, సబ్‌స్టేషన్‌లో ఏఈ జాన్‌, అంగన్‌వాడీ కార్యాలయాల్లో సులోచన, రాజమణి జాతీయ జెండాను ఎగుర వేశారు. 

తాండూర్‌, జనవరి 26  : తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కవిత, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో శశికళ, సర్కిల్‌ కార్యాలయంలో సీఐ బాబురావు, పోలీస్‌స్టేషన్ల లో ఎస్‌ఐలు శేఖర్‌రెడ్డి, మానస, ఎమ్మార్సీలో ఎం ఈవో ప్రభాకర్‌, పీఆర్‌ కార్యాలయంలో డీఈ గిరీశ్‌, ట్రాన్స్‌ కో కార్యాలయంలో ఏఈ ప్రభాకర్‌, ఏవో ఆఫీస్‌లో ఏవో కిరణ్మయి, సింగిల్‌ విండో కార్యాలయంలో చైర్మన్‌  సత్యనారాయణ, బీపీఏ ఓసీపీ-2 ఎక్స్‌టెన్షన్‌ కృషి భవన్‌ వద్ద పీవో కే చం ద్రశేఖర్‌, మాదారం టీబీజీకేఎస్‌ కార్యాలయంలో ధరావత్‌ మంగీలాల్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆగమరావు, టీఆర్‌ఎస్‌ జెండా గద్దె వద్ద సీనియర్‌ నేత మహేందర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. 

మందమర్రి, జనవరి 26 : విద్యానగర్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ గద్దె రాజు, పోలీస్‌స్టేషన్‌ లో ఎస్‌ఐ భూమేశ్‌, విద్యుత్‌ శాఖ కార్యాలయం లో ఏఈ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ దవాఖాన వద్ద డాక్టర్‌ శైలజ, శ్రీపతినగర్‌ వీఎల్సీ సెంటర్‌ వద్ద గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బీవి ప్రేమరాణి, పలుచోట్ల టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

చెన్నూర్‌ రూరల్‌ : లంబాడీపల్లి, కిష్టంపేట, కొమ్మెర, నాగాపూర్‌, అంగ్రాజ్‌పల్లి, కత్తెరశాల, పొక్కూర్‌, బీరెల్లి, చెల్లాయిపేట, సంకారం, సోమన్‌పల్లి, పలు గ్రామాల్లో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. 

రామకృష్ణాపూర్‌, జనవరి 26 : క్యాతనపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జీ వెంకటనారాయణ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ కటికె రవిప్రసాద్‌, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో అబ్దుల్‌ అజీజ్‌, ఆర్కేపీ సీహెచ్‌పీలో డీజీఎం చెరు వు శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. 

మందమర్రి రూరల్‌ : జీఎం కార్యాలయ అవరణలో జీఎం చింతల శ్రీనివాస్‌ జాతీయ పతాకా న్ని ఎగురవేశారు. అనంతరం ఉత్తమ కార్మికులను సన్మానించారు. ఆయన ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది           గౌరవ వందనాన్ని స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గనులు, డిపార్ట్‌మెంట్లలో అధికారులు, పిట్‌ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజలింగు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

భీమారం, జవనవరి 26 : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆవిష్కరించగా ఎం పీపీ చెరుకు దీపికారెడ్డి, రాష్ట్ర నాయకుడు చెరుకు సరోత్తమరెడ్డి పాల్గొన్నారు. పంచాయతీలో సర్పంచ్‌ గద్దెరాంరెడ్డి, తహసీల్‌ కార్యాలయంలో విజయానందం, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ బర్ల సం జీవ్‌, ఏఈవో కార్యాలయంలో అరుణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో అధ్యక్షుడు కొత్తపోటు రాజేశ్వర్‌ రెడ్డి, ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఫక్రొద్దీన్‌ జెండాను ఆవిష్కరించారు.  

జైపూర్‌, జనవరి 26 : తహసీల్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో కే నాగేశ్వర్‌రెడ్డి, జైపూ ర్‌ ఏసీపీ కార్యాలయం వద్ద ఏసీపీ నరేందర్‌, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏఈ సదానందం, వ్యవసాయ కార్యాలయంలో ఏవో మార్క్‌గ్లాడ్‌సన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. 

జన్నారం, జనవరి 26 : కార్యాలయాల్లో తహసీల్దార్‌ పుష్పలత, ఎఫ్‌డీవో మాధవరావు, ఎస్‌ఐ మధుసూదన్‌రావు, ఎంఈవో విజయ్‌కుమార్‌, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీ య జెండాను ఎగురవేశారు. 

బెల్లంపల్లిరూరల్‌, జనవరి 26 : ఎంపీడీవో విజయలక్ష్మి, కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ రాజేశ్వర్‌నాయక్‌, గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు, కాసిపేట గురుకులంలో ప్రిన్సిపాల్‌ రమేశ్‌, సంక్షేమ బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎస్‌ స్వరూప, పశువైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్‌ శ్రావణ్‌, తాళ్లగురిజాల పీహెచ్‌సీలో వైద్యాధికారి ఝాన్సీ, వ్యవసా య కార్యాలయంలో ఏవో సుద్దాల ప్రేమ్‌కుమార్‌, చంద్రవెళ్లి సహకార సంఘం కార్యాలయంలో సింగిల్‌ విండో చైర్మన్‌ చింతం స్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. 

వేమనపల్లి, జనవరి 26 : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, నీల్వాయిలో జడ్పీటీసీ ఆర్‌ స్వర్ణలత, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మధుసూదన్‌, పోలీ స్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రహీంపాషా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు కృష్ణ, ఎంఈవో కార్యాల యంలో తిరుపతిరెడ్డ్డి, వ్యవసాయ కార్యాలయం లో ఏవో విజయ్‌కుమార్‌, వెటర్నరీ దవాఖానలో వైద్యుడు చందన్‌ కుమార్‌, గ్రామాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. 

నెన్నెల, జనవరి 26 : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రమాదేవి,  తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రమా కాంత్‌, ఫారెస్ట్‌ రేంజ్‌లో రేంజర్‌ గోవింద్‌ చంద్‌ సర్దార్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ అనీష్‌, వెటర్నరీలో డాక్టర్‌ దిలీప్‌, సహకార కార్యాలయం లో సీవో రాజేశ్‌, వ్యవసాయ డివిజన్‌ కార్యాలయంలో ఏడీ ఇంతియాజ్‌, కస్తూర్బాలో ప్రత్యేక అధికారి పద్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంచందర్‌ జాతీయ జెండాను ఎగుర వేశారు.  

కాసిపేట, జనవరి 26 : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ భూమేశ్వర్‌, సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్‌ నీలా రాంచందర్‌, పెద్దనపల్లిలో జడ్పీటీసీ పల్లె చంద్ర య్య, విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈవో దామోదర్‌రావు, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అధ్యక్షుడు సోదారి సురేశ్‌, దేవాపూర్‌లో ఓసీసీ గుర్తింపు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏనుగు తిరుపతిరెడ్డి, దేవాపూర్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం, కాసిపేట గ్రామ అధ్యక్షుడు దుర్గం రాంచందర్‌ జెండా ఎగురవేశారు. 

కన్నెపల్లి, జనవరి 26 : తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో శంకరమ్మ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి జాతీయ జెం డాను ఆవిష్కరించారు. 

VIDEOS

logo