ప్రగతికే ప్రాధాన్యం

- జిల్లాల సమగ్రాభివృద్ధికి అడుగులు
- అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
- కలెక్టర్లు భారతీ హోళికేరి, రాహుల్‌రాజ్
- ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవం
- మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో వేడుకలు
- పోలీసుల గౌరవ వందన సమర్పణ
- ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ
- ఆయా చోట్ల పాల్గొన్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనప్ప, సక్కు, జడ్పీ చైర్పర్సన్లు భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మి
మంచిర్యాల, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లాను అందరి భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పలువురికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రైతు బంధు పథకం ద్వారా 1,31,000 మంది రైతులకు రూ.162 కోట్లు అందజేశామన్నారు. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షలతో నిర్మిస్తున్నామని, 55 చోట్ల పనులు చేపట్టగా, ఇప్పటికే ఆరు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పాం తోటల పెంపకం కోసం 32 వేల ఎకరాలకు 15 మండలాల్లో అనువైన వాతావరణం ఉందన్నారు. చెన్నూర్ నియోజకవర్గం పరిధిలో 400 ఎకరాలు లక్ష్యం కాగా, 152 మంది రైతులను గుర్తించి అనుమతిచ్చామని పేర్కొన్నారు. కొవిడ్ 19 నియంత్రణ కోసం జిల్లాలో లక్షా 24 వేల పరీక్షలు చేయగా, 14 వేల పాజిటివ్ కేసులు వచ్చాయని, 13 వేల మంది కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 2,925 మందికి వ్యాక్సిన్ వేయడంతో పాటు 73 శాతం పురోగతిలో ఉన్నామని వివరించారు. గొల్ల, కుర్మలకు జీవనోపాధి కల్పించేందుకు 963 యూనిట్లకు రూ.10 కోట్ల 60 లక్షలు ఖర్చు చేశామన్నారు. గొర్రెల బీమా పథకం కింద 1,600 చనిపోయిన గొర్రెలకు గాను, తిరిగి 1,532 ఇప్పించామని తెలిపారు. నీలి విప్లవంలో భాగంగా జిల్లాలో 56 ఎకరాల విస్తీర్ణంలో చేప పిల్లల పెంపకంతో పాటు 60 శాతం రాయితీపై మంజూరు చేశామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా నాలా కన్వర్షన్ కోసం 49 దరఖాస్తులు రాగా, 44 అనుమతి ఇచ్చామని, మ్యుటేషన్ కోసం 558 దరఖాస్తులు రాగా, 466 పూర్తి చేశామని స్పష్టంచేశారు. కల్యాణ లక్ష్మి ద్వారా ఇప్పటి వరకు 5,141 దరఖాస్తులు రాగా, 3,468 మందికి ఆర్థిక సాయం అందించామని, షాదీముబారక్‌లో 341 ఆన్లైన్ దరఖాస్తులు రాగా, 130 మంది లబ్ధిపొందారని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల కింద 2356 ఇండ్లకు గాను, రూ.127 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. మిషన్ కాకతీయ నాలుగు దశల్లో 473 పనులకు గాను 425 పనులు పూర్తి చేశామని, రూ.85 కోట్ల70 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులైన శ్రీపాద ఎల్లంపల్లి, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 30 వేల ఎకరాలు, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ద్వారా 61,900 ఎకరాలు, మధ్య తరహా ద్వారా 27 వేల ఎకరాల భూమికి సాగునీరు అందించడంతో పాటు కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలో నీరు నింపుతున్నామని తెలిపారు. బెస్ట్ అవైలెబుల్ స్కూల్ పథకం కింద 69 మంది విద్యార్థులకు రూ.10 లక్షల 90 వేలు ఆర్థిక సాయం అందించామన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్ భగీరథ శుద్ధ తాగునీరు అందించడంలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో, అడ ఇంటెక్వెల్ ద్వారా బెల్లంపల్లి నియోజకవర్గంలో, కడెం ప్రాజెక్టు నుంచి జన్నారం మండలంలో మొత్తం 622 ఆవాసాలకు శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 87 పబ్లిక్ టాయిలెట్స్, ఆర్టీసీ ద్వారా రెండు బస్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ సాధారణ నిధుల నుంచి రూ.కోటీ 20 లక్షలతో గౌరవ సభ్యుల ఆమోదంతో 36 పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, ఎల్లంపల్లి జలాశయం, కవ్వాల్ అభయారణ్యం, గాంధారి ఖిల్లా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నామని, జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. అసిస్టెంట్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు, నాయకులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి కలెక్టర్ పలు స్టాళ్లను పరిశీలించారు.
తాజావార్తలు
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ