ఒడ్డెరకాలనీలో షార్ట్‌సర్క్యూట్

- ముగ్గురికి తీవ్రగాయాలు
మంచిర్యాలటౌన్, జనవరి 24: పట్టణంలోని ఒడ్డెరకాలనీలో ఆదివా రం విద్యుత్ హైటెన్షన్ తీగలకు కింద నుంచి విసిరిన మరో తీగ తాకడం తో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. ఒడ్డెరకాలనీలో ఫంక్షన్ కోసం హైటెన్షన్ లైన్ కిందనే టెంట్లు వేశారు. సౌండ్‌సిస్టం ఏర్పాటు చేసేందుకు టెంట్ హౌస్ నిర్వాహకుడు రవి పక్క ఇంటి నుంచి కరెంట్ వైరును టెంట్ పైనుంచి ఇవతలి వైపునకు విసిరాడు. ఈ సమయంలో పైనున్న హైటెన్ష న్ విద్యుత్ తీగలకు తగిలడంతో మంటలు చెలరేగాయి. టెంట్లు దగ్ధమ య్యాయి. ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో జనం పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా అయిన తీగ పల్లపు రాములు, అతడి అన్న కూతురు రజిత, టెంట్ హౌస్ యజమాని రవిపై పడడంతో గాయపడ్డారు. వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తర లించారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, తహసీ ల్దార్ రాజేశ్వర్‌రావు, విద్యుత్, అగ్నిమాపకశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
తాజావార్తలు
- అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు..
- వాస్తవాలకు అండగా నిలువండి
- ఆకట్టుకునేలా.. అక్కంపల్లి
- సీఎం సారూ.. మీ మేలు మరువం
- మాధవపల్లి సర్పంచ్, కార్యదర్శులకు నోటీసులు
- జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- ఆహ్లాదం పంచని ప్రకృతి వనం!
- బలహీనంగా ఉన్న పిల్లలకు రెట్టింపు పౌష్టికాహారం
- మాతా శిశు మరణాల శాతం తగ్గించాలి
- రసవత్తరంగా రణరంగం