కరోనా వలన ఆగిన సినిమా షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనలతో పాటు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తాజాగా సెట్లోకి అడుగుపెట్టారు. ముంబైకి చెందిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా టీంతో కలిసారు. ఆయనతో కలిసి రామ్ చరణ్ ఫొటోకి ఫోజిచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్గా మారింది.
కాల్పనిక గాథ ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల కాగా, ఇవి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ ప్యాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా, అలియా భట్, ఒలివియా మోరిస్ అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు