శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 24, 2021 , 01:55:49

స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన ర్యాలీ

స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన ర్యాలీ

బెల్లంపల్లిటౌన్‌, జనవరి 23 : మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాలీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం ప్రారంభించారు. ఈ ర్యాలీ పాత మున్సిపల్‌ కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా, బజార్‌ ఏరియా మీదుగా పురవీధుల వరకు కొనసాగింది. తడి, పొడి చెత్తను వేరుగా చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యేకు సూచించారు.  రోడ్ల మీద , ఇతర ఖాళీ స్థలాల్లో చెత్త వేయద్దని, చెత్త సేకరణకు 23  ఆటోలను కొన్నట్లు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ,  మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌, కౌన్సిలర్లు, నాయకులు నెల్లిగంటి  శ్రీధర్‌, తుంగపిండి గంగాధర్‌,  పాల్గొన్నారు. 

బెల్లంపల్లిలో సినిమా షూటింగ్‌ ప్రారంభం..బెల్లంపల్లిలో సినిమా షూటింగ్‌ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సీపీ సత్యనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాంమోహన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రారంభించారు. సినిమా హీరో సంపూర్ణేశ్‌బాబు, నిర్మాత తైదల బాపు, జబర్దస్త్‌ సత్తిపండు, నటులు మౌనిక, సాధన , మనీషాలు సందడి చేశారు. 


VIDEOS

logo