మంగళవారం 02 మార్చి 2021
Mancherial - Jan 24, 2021 , 01:55:47

పద్మల్‌పురి కాకో ఆలయంలో పూజలు

పద్మల్‌పురి కాకో ఆలయంలో పూజలు

  • మొక్కులు తీర్చుకున్న కోవ మోకాశీ వంశీయులు 

దండేపల్లి, జనవరి23 : దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో గల పద్మల్‌పురి కాకో ఆలయం శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కోవ మోకాశీ వంశీయులతో సందడిగా మారింది. ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, పూజలు చేశారు. చనిపోయిన కోవ వంశీయులకు  సంబందించిన తూమ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి యేటా పుష్య మాసంలో కోవ మోకాశీ వంశీయులు కాకో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. జల్లి దేవర ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఈనెల 25 వరకు పూజలు కొనసాగుతాయని  చెప్పారు. ఆలయ ఆవరణలో భక్తులు విందు భోజనాలు ఆరగించారు.

VIDEOS

logo