శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 24, 2021 , 01:55:45

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

  • ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుతో అగ్రవర్ణాల పేదలకు మేలు    
  • ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

చెన్నూర్‌, జనవరి 23: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పురా ణం సతీష్‌కుమార్‌ కొనియాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించడంపై  హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెన్నూర్‌ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శనివారం సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుతో బ్రాహ్మణ, వైశ్య, వెలమ, రెడ్డి, కమ్మ లాంటి అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో మేలు జరుగుతుందని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ అర్చన గిల్డా, ఎంపీపీ మంత్రి బాపు, జడ్‌పీటీసీ మోతె తిరుపతి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ రత్న సమ్మిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

మంచిర్యాలటౌన్‌, జనవరి 23: అగ్రవర్ణాల నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్‌ ప్రకటించిన సందర్భంగా పురస్కరించుకుని శనివారం టీఆర్‌ఎస్‌ మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు గాదె సత్యం మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు రిజర్వేషన్లు లేక విద్య, ఉపాధి, ఇతర అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. రిజర్వేషన్‌ అమలుతో పేదలకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌ వెంకటేశ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు సురేశ్‌కుమార్‌ బల్దవా, మినాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పెండ్లి అంజయ్య, తూముల నరేశ్‌, కొండాల్‌రావు, రవీందర్‌రావు, సత్యపాల్‌రెడ్డి, తోట తిరుపతి, బొలిశెట్టి కిషన్‌, పల్లపు తిరుపతి, శ్రీపతి వాసు, గడప రాకేశ్‌, బొట్ల సత్యనారాయణ, జగన్‌, వంశీ, సాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.                                               

రామకృష్ణాపూర్‌, జనవరి 23 :  క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి అగ్రవర్ణ పేదలు, నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జంగం కళ, వైస్‌ చైర్మన్‌ ఎర్రం విద్యాసాగర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు అలుగుల శ్రీలత, పార్వతీ విజయ, కో ఆప్షన్‌ సభ్యుడు యాకూబ్‌అలీ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అబ్దుల్‌ అజీజ్‌, బీ నర్సింగరావు, ఆంజనేయులు రావు, నీలం శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్‌, బొద్దుల ప్రేమ్‌సాగర్‌, సతీశ్‌, మూర్తి, బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, వైశ్య సంఘాల నాయకులు తదితరులున్నారు. 


VIDEOS

logo