శనివారం 27 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 24, 2021 , 01:42:44

జాతీయ స్థాయి క్రీడాకారిణిగా సమ్మక్క

జాతీయ స్థాయి క్రీడాకారిణిగా సమ్మక్క

దహెగాం,జనవరి 23: మండలంలోని ఒడ్డుగూడ గ్రామానికి చెందిన దాసరి సమ్మక్క జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా రాణిస్తున్నది. చిన్నరాస్పల్లి పాఠశాలలో చదువుతున్న క్రమంలో పీఈటీ ప్రోత్సాహంతో ఫుట్‌బాల్‌ క్రీడాకారి ణిగా సమ్మక్క ఎదిగింది. మొదట రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన అనేక పోటీల్లో రాణించి, పతకాలు సాధించింది. ముంబాయి, హరియానా ఒడిశా, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గతేడాది ఆమెను జిల్లాస్థాయిలో ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేసి, నగదు బహుమతితో సత్కరించారు.సమ్మక్క ప్రస్తుతం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే విద్యాలయంలో డిగ్రీ చదువుతున్నది.


VIDEOS

logo