ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 23, 2021 , 00:57:56

తేడా ఎందుకో ?

తేడా ఎందుకో ?

  • గ్రాట్యుటీ అమలులో అధికారులు, కార్మికుల మధ్య వ్యత్యాసం
  • రూ. 10 లక్షలు నష్టపోతున్న కార్మికులు
  • ఇరువురికీ ఒకే తేదీ నుంచి వర్తింపజేయాలని ఆందోళన

కోలిండియా వ్యాప్తంగా గ్రాట్యుటీ అమలులో అధికారులకు ఓ విధానం, కార్మికులకు మరో విధానం అమలు చేస్తున్నారు. అధికారులకు ఒక తేదీ, కార్మికులకు మరో తేదీ నుంచి వేర్వేరుగా అమలు చేస్తుండడంతో, ఆ సమయంలో విరమణ పొందిన కార్మికులు 14 నెలల గ్రాట్యుటీ నష్టపోతున్నారు.

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌), జనవరి 22 : 

రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు.. 

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికులకు రూ. 10 లక్షల గ్రాట్యుటీ నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. 2016 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు గ్రాట్యుటీ పెంచుతూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించింది. దీంతో బొగ్గు పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కూడా గ్రాట్యుటీ వర్తింపజేయడం జరుగుతుంది. కోలిండియా వ్యాప్తంగా బొగ్గు గని కార్మికులు 3.50 లక్షల మంది ఉండగా, వీరందరికీ లబ్ధి చేకూరనున్నది.

అమలు తేదీల్లో తేడాలతో రూ. 10 లక్షల నష్టం

అధికారులు, కార్మికులకు గ్రాట్యుటీ అమలు తేదీల్లో తేడాలు ఉన్నాయి. ఈ విధానంతో అధికారులకు లాభం చేకూరుతుండగా, కార్మికులు మాత్రం నష్టపోవాల్సి వ స్తున్నది. వేతన ఒప్పందంతో సంబంధం లేకుండా ఒకే తేదీని నిర్ణయించాల్సిన యాజమాన్యాలు, అధికారులకు ఒక తేదీ.. కార్మికులకు మరో తేదీని అమలు చేస్తున్నా యి. దీంతో కార్మికులు 14 నెలల తేడాతో రూ. 10 లక్ష లు నష్టపోవాల్సి వస్తుంది. అధికారులకు 2017 జనవరి నుంచి పెంచిన గ్రాట్యుటీని అమలు చేస్తున్నారు. కార్మికులకు మాత్రం 2018ఫిబ్రవరి నుంచి పదవీ విరమణ పొందిన కార్మికులకు వర్తింపజేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులకు కూడా అధికారులకు వర్తింప చేస్తున్నా 2017 జనవరి నుంచి అమలు చేయాలని కార్మిక సం ఘాలు, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కోలిండియా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బొగ్గు గని కార్మికుల పదో వేత న ఒప్పందం 2016, జూలై ఒకటి నుంచి ఆమలు కావా ల్సి ఉండగా, 2017 అక్టోబర్‌ 10న వేతన ఒప్పందం జరిగింది. గ్రాట్యుటీ మాత్రం 2018 ఫిబ్రవరి తర్వాత అమలు చేసేందుకు నిర్ణయించారు. అధికారుల వేతన ఒ ప్పందం జరిగిన 2017 జనవరి నుంచే పెంచిన రూ. 20 లక్షల గ్రాట్యుటీని అమలు చేస్తూ వర్తింపజేస్తున్నారు. కా ర్మికులకు వేతన ఒప్పందం తేదీతో సంబంధం లేకుండా మధ్య నుంచి అమలు చేస్తూ నష్ట పరుస్తున్నారు.

4000 మందికి నష్టం

అధికారులు, కార్మికులకు వ్యత్యాసంతో గ్రాట్యుటీ అమలు చేయడంతో సింగరేణిలో 2017 జనవరి నుంచి 2018 ఫిబ్రవరి వరకు 4000 మంది కార్మికులు నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కొక్కరు రూ. 10 లక్షలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు తేదీ నుంచి అధికారులు, కార్మికులకు అమలు చేస్తే లాభం చేకూరుతుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు కూడా దీనిపై ఆందోళనలు చేస్తున్నాయి. అధికారుల సంఘం కూడా 2016 జనవరి నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


VIDEOS

logo