మంగళవారం 02 మార్చి 2021
Mancherial - Jan 22, 2021 , 00:26:23

పారదర్శకంగా ఏఆర్‌ కానిస్టేబుళ్ల బదిలీలు

పారదర్శకంగా ఏఆర్‌ కానిస్టేబుళ్ల బదిలీలు

  • సీపీ సత్యనారాయణ

ఫర్టిలైజర్‌సిటీ, జనవరి 21 : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో పని చేస్తున్న 63 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌ విధానం ద్వారా బదిలీలు చేపట్టినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో గురువారం 63 మంది సిబ్బందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లి హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 19 మంది కానిస్టేబుళ్లను కుమ్రంభీం అసిఫాబాద్‌కు, నిర్మల్‌ జిల్లాకు ఒక కానిస్టేబుల్‌ను డ్రా పద్ధతి ద్వారా పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధు లు నిర్వర్తించి ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిజాయితీతో పని చేసి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్‌ అశోక్‌కుమార్‌, అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ కమాండెంట్‌  సంజీవ్‌, ఏఆర్‌ ఏసీపీ నాగ య్య, సుందర్‌ రావు, ఆర్‌ఐలు మధూకర్‌, అనిల్‌, శ్రీధర్‌ ఉన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo