ఆదివారం 07 మార్చి 2021
Mancherial - Jan 22, 2021 , 00:25:21

కల్లాలను త్వరగా పూర్తి చేయాలి

కల్లాలను త్వరగా పూర్తి చేయాలి

  • జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

హాజీపూర్‌, జనవరి 21 :  జిల్లాలో పంట కల్లాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు వినియోగంలోనికి తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వైకుంఠధామాలు, డంప్‌ యార్డులు, మొక్కలు నాట డం, నర్సరీల నిర్వహణ, పల్లె పకృతి వనాల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంకుడు గుంతలు, పల్లె ప్రగతి పనులు ఫిబ్రవరి 15వ తేదీలోగా అన్ని గ్రామాల్లో 100 శాతం పూర్తి చేయాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo