కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్

మంచిర్యాల అర్బన్, జనవరి 19 : జిల్లా కేంద్రంలోని దవాఖానలోని రెండు కేంద్రాలతోపాటు పాత మంచి ర్యాల యూపీహెచ్సీ, రాజీవ్ నగర్ యూపీహెచ్‌సీల్లో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో 287 మందికి టీకా వేయాల్సి ఉండగా 217 మందికి టీకా వేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 2200 మంది కి వ్యాక్సిన్ వేశారు. సూపరింటెండెంట్ అరవింద్, కొవిడ్ ఇన్చార్జి ప్రశాంత్, కళావతి, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి జనవరి19 : దీపక్నగర్లోని ప్రభుత్వ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీ చైర్సన్ నల్లా ల భాగ్యలక్ష్మి కొవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కరోనాను అంతమొందించడానికే ప్రభుత్వ టీకాను అందుబాటులోకి తీసుకొ చ్చిందన్నారు. వైద్యుడు శివప్రతాప్ మాట్లాడుతూ మొదటి రోజు 80 మంది సింగరేణి, ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకాను ఇచ్చినట్లు తెలిపారు.
చెన్నూర్, జనవరి 19 : ప్రభుత్వ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనా గిల్డా ప్రారంభించారు. డాక్టర్లు, సిబ్బంది టీకా తీసుకున్నారు.
కోటపల్లి, జనవరి 19 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో కొవిడ్-19 వాక్సినేషన్ పంపిణీ కేంద్రాన్ని ఎంపీపీ మంత్రి సురేఖ ప్రారంభించారు. సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. వైద్యాధికారి సత్యనారాయణ, పద్మజ, ఎంపీడీవో భాస్కర్, సర్పంచ్ రాగం రాజక్క, హెల్త్ సూపర్వైజర్లు జ్యోతి, శోభారాణి, తదితరులు ఉన్నారు.
జన్నారం, జనవరి 19 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ను జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖ ర్ ప్రారంభించారు. అశ కార్యకర్త లీలా కు వ్యాక్సిన్ ఏఎన్ఎం వేశారు. ఎంపీపీ మాదాడి సరోజన, సర్పంచ్ గంగాధర్, సుజాత,తదితరులు పాల్గొన్నారు
దండేపల్లి, జనవరి19 : మండల కేంద్రం, తాళ్లపేట పీహెచ్సీ ల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ప్రారంభిం చారు. పీహెచ్సీలో వైద్యాధికారి సునీల్, తాళ్లపేట పీహెచ్సీలో ఏఎన్ఎం రాంబాయి మొదటి టీకా వేసుకున్నారు. ఒక్కో పీహెచ్సీలో 100 మంది టీకాలు వేసుకున్నట్లు వైద్యులు తెలి పారు. వైద్యాధికారు లు సునీల్, స్ఫురణ, హరీశ్, వైస్ ఎంపీపీ అనిల్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పం చ్‌లు చంద్రకళ, కళావతి, ఉప సర్పంచ్‌లు పుట్టపాక తిరుపతి, భూమన్న, ఏఎన్ఎంలు, తదితరులు ఉన్నారు.
బెల్లంపల్లిటౌన్, జనవరి 19 : షంషీర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్ గెల్లిరాజలింగు, నాయకులు నెల్లికంటి శ్రీధర్, ఇన్చార్జి వైద్యాధికారిణి ఝాన్సీ, మధు పాల్గొన్నారు.
తాండూర్, జనవరి 19 : మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీపీ పూసాల ప్రణ య్‌కుమార్, ఎంపీడీవో శశికళ, డాక్టర్ కుమారస్వామి, తాం డూర్ ఇన్చార్జి సర్పంచ్ పూదరి నవీన్‌కుమార్ ప్రారంభిం చారు. ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి, అంగన్వాడీ టీచర్ల కు 70 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఎంపీటీసీ పెర్క రజిత, సూపర్వైజర్లు నరేశ్, ధనుంజయ్ ఉన్నారు.
నెన్నెల, జనవరి19 : కరోనా వ్యాక్సినేషన్‌ను మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ సంతోషం రమాదేవి ప్రారంభించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్ వా డీ టీచర్లు, ఆయాలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఎంపీడీవో వరలక్ష్మి, ఎస్ఐ రమాకాంత్, గ్రామ సర్పంచ్ తోట సూజాత, ఎంపీటీసీ తిరుపతి, డాక్టర్ అనీష్, తోట శ్రీనివాస్, సూపర్వైజర్ వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.కాగా మండల కేంద్రంలోని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నీరజ పరిశీలించారు. టీకాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు.
వేమనపల్లి, జనవరి 19 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరో నా వ్యాక్సినేషన్‌ను వైద్యాధికారి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. 65 మందికి టీకా వేసినట్లు ఆయన తెలిపారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కాసిపేట, జనవరి 19 : పీహెచ్సీలో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మొత్తం 95 మందికి టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో నీరజతో కలిసి ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రంరావు ప్రారంభించారు. సహకార చైర్మన్ నీలా రాంచంద ర్, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, సర్పంచ్‌లు ధరావత్ దేవి, ఆడె బాదు, ఎంపీడీవో ఎంఏ అలీం, బాలాజీ, వైద్యాధి కారి కిరణ్మై, డాక్టర్ శ్రీదేవి, నాయకులు రొడ్డ రమేశ్, దుర్గం రాంచందర్, కొండయ్య, సిబ్బంది గోపి పాల్గొన్నారు.
కన్నెపల్లి, జనవరి 19 : భీమిని పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి ప్రారం భించారు. వైద్యుడు శ్రీనివాస్, ఎంపీడీవో రాధాకృష్ణ, ఎంపీవో విజయ్ ప్రసాద్, ఎస్ఐ కొంరయ్య, కన్నెపల్లి వైస్ ఎంపీపీ రాకేశ్‌శర్మ, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్,జనవరి 19 : తాళ్లగురిజాల పీహెచ్సీలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణతో కలిసి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ప్రారం భించారు. వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. వైస్ ఎంపీపీ వెంబడి రాణి, గురిజాల సర్పంచ్ గాజుల రంజిత, ఎంపీటీసీ శకుంతల, వైద్యాధికారి ఝాన్సీ, నాయకులు కొమ్మెర లక్ష్మణ్, గాజుల వెంకటేశ్వర్‌గౌడ్, వెంబడి సురేశ్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట రూరల్, జనవరి 19 : పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా వ్యాక్సిన్‌ను వైద్య సిబ్బందికి ఇచ్చారు. మొదటి టీకా డా.శ్రీనివాస్‌కు వేశారు. మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, డా. కుమార స్వామి కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, జనవరి 19 : పీహెచ్సీలో సింగరేణి వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ టీకాలను వేశారు. సింగరేణి డీవై సీఎంవో విజయలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ సుమన్, ఇతర వైద్యులు, సిబ్బందితో పాటు మొత్తం 64మందికి టీకాలు వేశారు. జీఎం లక్ష్మీనారాయణ, పీహెచ్సీ వైద్యుడు జయరాజ్ పాల్గొన్నారు.