బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. అయితే కరోనా వలన కొద్ది రోజుల పాటు వాయిదా పడింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. త్వరలో షూటింగులు కూడా ఓపెన్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నార.
ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను జూమ్ ద్వారా పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, బిగ్ బాస్ సెట్‌కి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సీజన్ 5 సెట్‌ని చాలా రిచ్‌గా రూపొందించనున్నట్టు తెలుస్తుంది. జూలై, ఆగస్టులో అన్ని పనులన్నీ సిద్ధం చేసుకొని.. సెప్టెంబరులో షో మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక షో హోస్టుగా మళ్లీ నాగార్జుననే ఫైనల్ చేసినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..