శనివారం 27 ఫిబ్రవరి 2021
Mancherial - Jan 17, 2021 , 02:21:05

ప్రభుత్వ కృషి ఫలించింది

ప్రభుత్వ కృషి ఫలించింది

  • జడ్పీ చైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మి
  • కొవిడ్‌ టీకా పంపిణీ ప్రారంభం
  • ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హాజరు

మంచిర్యాల అర్బన్‌, జనవరి 16 : కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు టీకా అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ కృషి ఫలించిందని జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్‌-19 టీకా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. మొదటి దఫా జిల్లాలోని రెండు కేంద్రాల్లో 30 మంది చొప్పున 60 మందికి టీకా వేస్తున్నామన్నారు. త్వరలోనే జిల్లాలోని ప్రజలందరికీ ఉచితంగా ఈ టీకాను వేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్‌వో నీరజ, సూపరింటెండెంట్‌ అరవింద్‌, ఆర్‌ఎంవో అనిల్‌ కుమార్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మ న్‌ ముఖేశ్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, గాదె సత్యం, హండే, హరికృష్ణ, సత్యపాల్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

సీసీసీ నస్పూర్‌ : ప్రజారోగ్యానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం నస్పూర్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా వైద్యాధికారి నీరజ, మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యు లు టీకాను దవాఖానలో పనిచేసే స్వీపర్‌ ముత్తునూరి ఇందక్కకు వేశారు. 28మంది ఆశ కార్యకర్తల్లు, స్వీపర్‌, అటెండర్లతో కలుసుకుని మొత్తం 30 మందికి కరోనా వ్యాక్సిన్‌ టీకా ను పంపిణీ చేశారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఎలాం టి సమస్య తలెత్తలేదు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు సీపతి సుమతి, జబీన్‌ హైమద్‌, కుర్మిళ్ల అన్నపూర్ణ, బండి పద్మ, బోయ మల్ల య్య, చిడం మహేశ్‌, మర్రి మొగిలి, బెడికే లక్ష్మి, సుర్మిల్ల వేణు, కోఆప్షన్‌ సభ్యులు ముత్తె రాజేశం, నాసర్‌, తహసీల్దార్‌ శేఖర్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో అనిత, పీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ జయప్రకాశ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గర్శె భీమయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, కమలాకర్‌రావు, ఖాలీద్‌, పెరుమాళ్ల జనార్దన్‌, ఇరికిళ్ల పురుషోత్తం, దగ్గుల మధు, కాటం రాజు, రౌతు రజిత, చెల్ల విక్రమ్‌, రవిగౌడ్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo