కేసీఆర్, మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం

మంచిర్యాల అర్బన్, జనవరి 15 : ముదిరాజ్ ముత్తరాసి, తెనుగు, గంగపుత్ర, బెస్త, గూండ్ల యువతకు మత్స్యశాఖ ద్వారా మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్అండ్బీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పేట మల్లయ్య, ఉపాధ్యక్షుడు దండవేని భాస్కర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుమలేశ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కనుకుంట్ల తిరుమల, ప్రధాన కార్యదర్శి ముల్కలపల్లి మంజులవాణి, నూనె కల్యాణి, జిల్లా యూత్ అధ్యక్షుడు గుండు రాజ్, గరిగంటి మహేశ్, సబ్బని లక్ష్మీనారాయణ, నూనె రవీందర్, ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
- 'నాంది' రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..
- త్వరలో జియో లాప్టాప్.. చౌకగానే?!
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఏసీబీ వలలో మన్నెగూడ సర్పంచ్
- మాస్కులు లేనివారి నుండి డబ్బులు వసూలు.. నకిలీ పోలీసు అరెస్టు
- 30 రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ చేయడమెలా..?
- మేమంతా టీఆర్ఎస్ వెంటే..తువగడ్డ తండా గిరిజనులు
- విజయ్‌మాల్య అప్పగింత డౌటే.. బ్రిటన్ ఏమందంటే?!