శుక్రవారం 05 మార్చి 2021
Mancherial - Jan 16, 2021 , 01:56:13

యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

  • బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 

తాండూర్‌, జనవరి 15 : యువత, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదలతో సాధించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. మండలంలోని బోయపల్లి గ్రామంలో శుక్రవారం మాసాడి రామయ్య పటేల్‌ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు,  క్రీడల్లోనూ రాణించాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, బుగ్గ దేవస్థానం చైర్మన్‌ మాసాడి శ్రీదేవి, ఎంపీటీసీ సిరంగి శంకర్‌, సీఐ కోట బాబురావు, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, నిర్వాహకులు మాసాడి తిరుపతి, స్థానిక నాయకులు, యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo