జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు

మంచిర్యాల అర్బన్, జనవరి 13 : పట్టణంలోని బైపాస్‌రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్ద మంచిర్యాల జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం భోగి వేడుకలు నిర్వహించారు. భోగి మంటల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రా రంభించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజ య్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, జాగృతి జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేమ్‌రావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మేడి రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మ న్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, సాహిత్య విభాగం అధ్యక్షుడు రాజేశం గౌడ్, సత్తయ్య, పడాల వెంకటేశ్వర్రావు, మనబోతుల వెంకటేశ్వర్లు, కరుణాకర్, మద్దుల రాజిరెడ్డి, మాంతయ్య, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 13 : మండలంలో భోగి వేడుకలు నిర్వహించారు. మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆయన సతీమణి సునంద ఇంటి ఎదుట ముగ్గు వేశారు.
కాసిపేట, జనవరి 13 : మండల కేంద్రం లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి, సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, జాగృతి జిల్లా కో కన్వీనర్ మద్ది లక్ష్మణ్, నియోజకవర్గ కో కన్వీనర్ లవుడియా శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సోదా రి సురేశ్ గంగాధరి రాజ్‌కుమార్, కనక వంశీకృష్ణ పాల్గొన్నారు. సోమగూడెం షాపింగ్ కాంప్లెక్స్ వర్తక సంఘం గణేశ్ మండలి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. కడలి శ్రీకాంత్, రాకేశ్, శేఖర్, హరి ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..
- సంఘటితంతోనే మహిళల రాణింపు