శనివారం 16 జనవరి 2021
Mancherial - Jan 13, 2021 , 00:59:45

మంచిర్యాలలో 2కే రన్‌

మంచిర్యాలలో 2కే రన్‌

మంచిర్యాల అర్బన్‌, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మంగళ వారం టీఆర్‌ఎస్‌ యూత్‌ ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నడిపెల్లి విజిత్‌రావు ప్రారంభించారు. మంచిర్యాల ఐబీ నుంచి వెంకటేశ్వర థియేటర్‌, అర్చనా టెక్స్‌ చౌరస్తా మీదుగా బస్టాండ్‌ సమీపంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు సాగింది. వివేకానందుడి స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని వారు సూచించారు. అనంతరం విజేతలు ఎం సాయి సుశాంత్‌, బీ ఓంసింగ్‌, సీహెచ్‌ అజిత్‌, ఎం శ్రీవైష్ణవి, కే తులసీ చౌదరి, సీహెచ్‌ శ్రీనిధికి బహుమతులు అందజేశారు. ఈ ర్యాలీలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సందెల వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు రాకేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిలర్లు నల్ల శంకర్‌, పొడేటి రాజు, సుధమల్ల హరికృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు, యువకులు గోగుల రవీందర్‌ రెడ్డి, తోట తిరుపతి, ఎండీ గౌస్‌, సత్యపాల్‌ రెడ్డి, తూముల నరేశ్‌, బింగి ప్రవీణ్‌, సుధమల్ల అశోక్‌ తేజ, చిప్పకుర్తి జగన్‌, సంతోష్‌, రమేశ్‌, పడాల రవీందర్‌, పీడీలు గోపాల్‌, గాజుల శ్రీనివాస్‌, సదానందం, సుదీప్‌, రాజమల్లు, అనిల్‌, చిరంజీవి, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.