మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Jan 12, 2021 , 00:12:00

లీజు అటవీ భూముల పరిశీలన

లీజు అటవీ భూముల పరిశీలన

మంచిర్యాల టౌన(శ్రీరాంపూర్‌), జనవరి 11 : శ్రీరాంపూర్‌ ఏరియా ఇందారం ఓసీపీ, గనులకు సంబంధించి లీజు అటవీ భూములను(2వ దఫా రెన్యువల్‌ ప్రతిపాదనలో ఉన్న) సోమవారం కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అండ్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌, మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రె పరిశీలించారు. వారికి జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, ప్రాజెక్టు ఆఫీసర్‌ రాజేశ్వర్‌రెడ్డి సింగరేణి లీజుకు తీసుకున్న అటవీ శాఖ భూములను చూపించి బౌండరీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్‌ ఆఫీసర్‌ బాలసుబ్రహ్మణ్యం, సర్వే ఆఫీసర్‌ రాఘవేంద్రరావు, మంచిర్యాల డివిజన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ వినయ్‌కుమార్‌ సాహూ పాల్గొన్నారు.