ఆదివారం 17 జనవరి 2021
Mancherial - Jan 11, 2021 , 01:35:45

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌), జనవరి 10 : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జీఎం కే లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్‌ ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌ విలేకరులు, అధికారులకు స్నేహ పూర్వక క్రికె ట్‌ పోటీలు నిర్వహించగా, జీఎం ప్రారంభించారు. అధికారుల జట్టు విన్నర్‌గా, పాత్రికేయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అనంతరం విజేతలకు జీఎం, డీవైజీఎం గోవిందరాజు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు యెక్కటి రాంరెడ్డి బహుమతులు అందించారు. అధికారుల సం ఘం కార్యదర్శి మాధవ్‌, పీఎం తుకారాం, కెప్టెన్‌ ఖాదీర్‌, మేనేజర్‌ ఉమాకాంత్‌, ఎస్‌ఈ కిరణ్‌కుమార్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ అశోక్‌, కోఆర్డినేటర్‌ సిద్దంశెట్టి రమేశ్‌ పాల్గొన్నారు.