గురువారం 28 జనవరి 2021
Mancherial - Jan 11, 2021 , 01:35:37

గొర్రెల పంపిణీని వినియోగించుకోవాలి

గొర్రెల పంపిణీని వినియోగించుకోవాలి

మందమర్రి, జనవరి 10 : ప్రభుత్వం ఈ నెల 16 నుంచి గొర్రెల పంపిణీని చేపట్ట నుందని, ఈ కార్యక్రమాన్ని యాదవులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొద టి విడుతలో మిగిలిన 20 శాతం గొర్రెల పంపిణీని ఈ నెల 16వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించడం హర్షనీయమన్నారు. ఇందులో యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సతీశ్‌ యాదవ్‌, నాయకులు మల్లెత్తుల నరేశ్‌ యాదవ్‌, రాజు యాదవ్‌, నాగవేని ఐలయ్య యాదవ్‌, దేవా బాపు యాదవ్‌, దారవేణి రాజయ్య యాదవ్‌, నలిగేటి మల్లేశ్‌ యాద వ్‌, రాజన్న యాదవ్‌, మహేశ్‌ యాదవ్‌, మద్దెల సాయి యాదవ్‌ పాల్గొన్నారు.  


logo