మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Jan 10, 2021 , 00:12:45

జాబ్‌మేళాలో 156 మంది ఎంపిక

జాబ్‌మేళాలో 156 మంది ఎంపిక

మంచిర్యాలటౌన్‌, జనవరి 9: మంచిర్యాలలోని ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాలో 156 మంది అభ్యర్థులు పలు కంపెనీల్లో పనిచేసేందుకు ఎంపికయ్యారని ఆ కేంద్రం డైరెక్టర్‌ మల్లికార్జున్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 200 మంది హాజరవగా, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 156 మందిని ఎంపికచేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏకైక నైపుణ్య, శిక్షణా సంస్థ తమదేనని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్టిమేట్‌ ఎనర్జీ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీనివాస్‌, కౌశల్‌ కేంద్రం మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సందీప్‌ పాల్గొన్నారు. logo