మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Jan 10, 2021 , 00:12:34

కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

హాజీపూర్‌, జనవరి 9 : మొదటి విడుత డీడీలు కట్టిన గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో యాదవులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గొల్లపల్లిలో కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. యాదవ సంఘం నాయకులు గొల్ల నాగన్న మాట్లాడుతూ కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అధికారులను ఆదేశించడం సంతోషంగా ఉందన్నారు. రెండో విడుత పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే ఆర్థిక బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలుపడం బాగుందన్నారు. కార్యక్రమంలో గెల్లు చిన్న రామన్న,చంద్రయ్య,కుమార్‌,శంకరయ్య,లచ్చన్న, కొమురయ్య, లింగయ్య పాల్గొన్నారు.


logo