మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Jan 09, 2021 , 01:23:18

10 నుంచి మంచిర్యాలలో జాగృతి క్రికెట్‌ కప్‌

10 నుంచి మంచిర్యాలలో జాగృతి క్రికెట్‌ కప్‌

మంచిర్యాలటౌన్‌, జనవరి 8 : ఈ నెల 10 నుంచి 19 వరకు తెలంగాణ జాగృతి క్రికెట్‌కప్‌-2021 పోటీలను మంచిర్యాలలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల మై దానంలో నిర్వహించనున్న ట్లు పోటీల నిర్వాహకుడు శశి శుక్రవారం తెలిపారు. ఒక్కో పూల్‌లో మూడు జట్ల చొప్పున నాలుగు పూల్‌లు ఏర్పాటు చేశామని, పూల్‌ ఏ, బీలోని జట్లకు జనవరి 10, 11, 12 తేదీల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నా రు. పూల్‌ సీ, డీలోని జట్లకు 13, 14, 15 తేదీల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పూల్‌ ఏలో మంచిర్యాల గురూస్‌, సిద్దిపేట, ధృవపాండ క్రికెట్‌ క్లబ్‌, పూల్‌ బీలో తెలంగాణ జాగృతి, మంచిర్యాల ఎలెవన్‌, హైవెల్డ్‌ లయన్స్‌, పూల్‌ సీలో హైదరాబాద్‌కు చెందిన సలీంనగర్‌, రవి క్రికెట్‌ అకాడమీ, ఆదిలాబాద్‌ జాహ్నవి క్రికెట్‌ క్లబ్‌, పూల్‌ డీలో హైదరాబాద్‌కు చెందిన డెక్కన్‌ క్రికెట్‌ అకాడమీ, ఖమ్మం భద్రాద్రి లెవన్‌, గోదావరిఖనికి చెందిన గోదావరి బ్లూస్‌ జట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. జనవరి 19న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.