సోమవారం 18 జనవరి 2021
Mancherial - Jan 09, 2021 , 01:23:20

లక్ష్య సాధనకు కృషి చేయాలి

లక్ష్య సాధనకు కృషి చేయాలి

  • సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ ప్రాజెక్టు అండ్‌ ప్లానింగ్‌) బలరాం

మందమర్రి రూరల్‌, జనవరి 8 : ఏరియాకు ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ ప్రాజెక్టు అండ్‌ ప్లానింగ్‌ ) బలరాం అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని తెలిపారు. ఉత్పత్తికి అయ్యే ఖర్చునూ తగ్గించేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బొగ్గు కొనుగోలుపై తీవ్ర పోటీ ఉందన్నారు. అనుకున్న సమయానికి నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తేనే లాభాసాటిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్‌చార్జి జీఎం వెంకటేశ్వర్లు, కేకే ఓసీ ప్రాజేక్టు అధికారి పద్మనాభరెడ్డి, ఏజీఎం (ఎఫ్‌ఆండ్‌ఏ) చక్రవర్తి, ఏజెంట్‌ రాంచందర్‌, డీజీఎం ఐఈడీ రాజన్న, మేనేజర్‌ భిక్షమయ్య, తదితరులు పాల్గొన్నారు.