మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Jan 08, 2021 , 01:32:17

తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి

తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి

  • ఓటర్ల జాబితా రాష్ట్ర పరిశీలకురాలు యోగితారాణా

హాజీపూర్‌,.జనవరి 7 : ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని బూత్‌స్థాయి అధికారులను ఎన్నికల ఓటరు జాబితా రాష్ట్రపరిశీలకురాలు, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితారాణా ఆదేశించారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ భారతీ హోళికేరితో కలిసి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బందితో ఓటరు జాబితా పై సంక్షిప్త సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఓటర్ల జాబితా  పరిశీలకులు, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా  అనర్హులు,  మృతి చెందిన వారు, ఊరు, చిరునామా మార్చిన వారి వివరాలను తొలగించాలని ఆదేశించారు. ఏదైనా ఫిర్యాదు అందినా, ఫారం 6,7,8 ఏ దరఖాస్తులు వచ్చినా వెంటనే పరిష్కరించాలన్నారు. జనవరి 1, 2021 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని  సూచించారు. అనంతరం డాటా ఎంట్రీ ఆపరేటర్ల పనితీరును పరిశీలించడంతో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఓటరు జాబితా నమోదు తదితర కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో రమేశ్‌, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, ఎన్నికల విభాగం అధికారులు శ్రీనివాస్‌, రజిని, జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, బూత్‌స్థాయి అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌ జన్కాపూర్‌, జనవరి 7: తప్పుల్లేకుండా ఓటరు జాబితా రూపొందించాలని ఓటర్ల జాబితా రాష్ట్ర పరిశీలకురాలు, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితా రాణా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమవేశ మందిరంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.