శనివారం 23 జనవరి 2021
Mancherial - Jan 04, 2021 , 02:09:05

నిరుపేద పెండ్లికి ఆర్థిక సాయం

నిరుపేద పెండ్లికి ఆర్థిక సాయం

రామకృష్ణాపూర్‌, జనవరి 3 : మందమర్రిలోని 2వ జోన్‌కు చెందిన జంపాల తిరుపతి ఇటీవల మృతిచెందగా, ఆయన కూతురు శిరీష వివాహానికి మేము సైతం స్వచ్ఛంద సంస్థ సేకరించిన ఆర్థికసాయాన్ని సీఐ ఎడ్ల మహేశ్‌ ఆదివారం అందించారు. మందమర్రికి చెందిన తిరుపతికి ముగ్గురు కూతుళ్లు. పెద్దకూతురు శిరీషకు ఈ నెల 6న పెండ్లి నిశ్చయించారు. పనులపై తిరుగుతూ రోడ్డు ప్ర మాదంలో మృతిచెందాడు. దీంతో ముగ్గురు బిడ్డలు అనాథలయ్యారు. కాగా, మానవత్వం తో అందరూ ముందుకు వచ్చారు. మేము సైతం స్వచ్ఛంద సంస్థ 75 కిలోల బియ్యం, రూ.1,07,516 సేకరించింది. వాటిని పెండ్లి కూతురు శిరీషకు అందించారు. గొప్ప మనసుతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన స్వచ్ఛంద సంస్థను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ భూమేశ్‌, సంస్థ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌, సభ్యులు పత్తిపాక శ్రీనివాస్‌, కొండ శ్రీనివాస్‌, బిరుదు సత్యం, బోరిగం వెంకటేశ్‌, రాకం సంతోష్‌, ఈర్లపాటి సోమయ్య, గొట్టె రాజేందర్‌, కొంగల శ్రీనివాస్‌రెడ్డి, రాంవేణు, అక్కెపల్లి జనార్దన్‌, వడ్ల రవి, మేరుగు తిరుపతి, ఎండీ ఖదీర్‌, తదితరులు పాల్గొన్నారు. logo