శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Jan 01, 2021 , 04:30:31

రూ. 6.94 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

రూ. 6.94 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

  • మంచిర్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం

మంచిర్యాలటౌన్‌, డిసెంబర్‌ 31 : 14వ ఆర్థిక సంఘం నిధులతో మంచిర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో రూ. 6.94 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. పట్టణంలో రెండు ప్రాంతాల్లో డంప్‌ యార్డుల కోసం 16 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, 

త్వరలోనే ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించనున్నారని కౌన్సిలర్లకు మున్సిపల్‌ చైర్మన్‌ సమాధానమిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల అభివృద్ధికి రూ.75 లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.వార్డుల్లోని రోడ్లపై ఏర్పడిన గుంతలను సిమెంట్‌ కాంక్రీట్‌తో పూడ్చేందుకు రూ.5 లక్షలు వెచ్చించారు. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 21 ఫ్లెక్సీల ఏర్పాటుకు రూ. 44,500 కేటాయించారు. అనువైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని కారణంగా పట్టణంలో నిర్మించాలనుకున్న మూడు వైకుంఠధామాలు, టూటౌన్‌ ఏరియాలో నిర్మించాలనుకున్న మార్కెట్‌కు కేటాయించిన నిధులను ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి కేటాయించారు. ఆ పనులకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులను కేటాయిస్తున్నట్లు ఎజెండాలో పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి, ఎంఈ మధూకర్‌, ఏఈ నర్సింహస్వామి, టీపీవో సత్యానారాయణ, మేనేజర్‌ వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


తాజావార్తలు


logo