శనివారం 23 జనవరి 2021
Mancherial - Dec 31, 2020 , 02:55:14

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు పెంచాలి

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు పెంచాలి

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల జిల్లాలో ఓపెన్‌ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని డీఈవో వెంకటేశ్వర్లు సూచించారు. డీఈవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో ఓపెన్‌ స్కూల్‌ గురించి ఎక్కువ ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. వయోజన విద్య, డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘా లు, రాజకీయ నాయకుల స హకారంతో జనవరి 5వ తేదీలోపు అడ్మిషన్లను పూర్తి చేయాలన్నారు. జనవరి 15లోగా పదో తరగతికి రూ.100, ఇం టర్‌కు రూ.200 ఫైన్‌ చెల్లించి ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. 

అనంతరం ఓపెన్‌ స్కూల్‌ పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో ఏసీజీఈ దామోదర్‌రావ్‌, ఉమ్మడి జిల్లా తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌, ఓపెన్‌ స్కూల్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.logo