మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Dec 31, 2020 , 02:47:58

పాఠశాలలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి

పాఠశాలలకు  నల్లా కనెక్షన్లు ఇవ్వాలి

  • ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
  •  మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

హాజీపూర్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పాఠశాలలకు నల్లా కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ వెంకటేశ్వర్లు, మిషన్‌ భగీరథ  ఈఈ అంజన్‌ రావుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 18, జనవరి 2021లోగా పనులు పూర్తి చేయాలని  పేర్కొన్నారు. జిల్లా లో 644 పాఠశాలలున్నాయని, వీటి లో 426 పాఠశాలలకు మిషన్‌ భగీరథలో భాగంగా తాగునీటి నల్లా కనెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా 218 పాఠశాలలకు 18, జనవరి 2021 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ డిప్యూటీ ఈఈ ఎస్‌ వెంకటేశ్‌, అజహర్‌, విద్యాసాగర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.