ఆదివారం 24 జనవరి 2021
Mancherial - Dec 29, 2020 , 01:14:17

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడాలి

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వీడాలి

  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

చెన్నూర్‌ రూరల్‌ : మండలంలోని అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యాన్ని వీడాలని, పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. చెన్నూర్‌ మండలంలోని అంగ్రాజ్‌పల్లి, గంగారం, కాచన్‌పల్లి గ్రామాల్లోని నర్సరీలు, ప్రకృతి వనాలను సోమవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. నర్సరీల్లో లక్ష్యం ప్రకారం మొక్కలు పెంచాలని సూచించారు. ప్రతిరోజూ మొక్కలకు నీళ్లు పోసి సంరక్షించాలని పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు నర్సరీల్లో పనులు కల్పించాలని తెలిపారు. విత్తనాలు మొలవని పరిస్థితుల్లో ఫారెస్ట్‌ అధికారుల సూచనలు పాటించాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు ప్రతిరోజూ గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు పరిశీలించాలని తెలిపారు. రైతు వేదిక, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో మల్లేశంను ఆదేశించారు. శ్మశానవాటిక, డంప్‌ యార్డు పనుల్లో నిర్లక్ష్యం చేసిన కాంటాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతివనం ఏర్పాట్లు పూర్తి చేసి పలు రకాల మొక్కలను పెంచాలని తెలిపారు. 

అనంతరం గంగారం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని, గ్రామసభలకు ప్రజలు హాజరయ్యేలా చూడాలని సర్పంచ్‌, సెక్రటరీలకు సూచించారు. పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో మల్లేశం, ఈజీఎస్‌ ఏపీవో గంగాభవాని, టీఏలు రవీందర్‌, లక్ష్మణ్‌, వెంకటేశ్‌, తదితరులు ఉన్నారు. logo