శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Dec 29, 2020 , 01:14:17

పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించాలి

పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించాలి

  •  వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంవో ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్‌

మంచిర్యాలటౌన్‌ : పట్టణాల అభివృద్ధిపై మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ సూచించారు. సోమవారం ఆమె హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితోపాటు ఆయా మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. 2021-22 సంవత్సరానికి గానూ హరితహారం మొక్కల పెంపకం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, నర్సరీల పెంపకం, పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి, చిట్టడవుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

 పట్టణ ప్రగతి నిధుల వినియోగం, సక్రమంగా పనులు జరిగేలా చూడడం, స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 అమలు తీరు, సఫాయి మిత్ర సురక్షా చాలెంజ్‌ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకు సాగాలన్నారు. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజల మెరుగైన జీవన విధానాన్ని పెంపొందించాలని, అందుకు అనుగుణంగా చేపట్టే పనులు దోహదపడాలని కోరారు. వీసీలో జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.