సోమవారం 18 జనవరి 2021
Mancherial - Dec 26, 2020 , 00:03:55

వైభవంగా వైకుంఠ ఏకాదశి

వైభవంగా వైకుంఠ ఏకాదశి

మంచిర్యాలకల్చరల్‌: జిల్లాలోని వివిధ ఆలయాల్లో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, ప్రజాప్రతినిధులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. చెన్నూర్‌లోని జగన్నాథ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని విశ్వనా థ ఆలయంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు.  మందమర్రి లో  వేంకటేశ్వర ఆలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లా ల భాగ్యలక్ష్మి, మాజీ విప్‌ ఓదెలు దంపతులు, సింగ రేణి జీఎం చింతల శ్రీనివాస్‌ లక్ష్మి స్వామి వారిని దర్శించుకున్నారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, సీఐ ఎడ్ల మహేశ్‌, తదితరులు పూజలు చేశారు. జిల్లాలో ని బెల్లంపల్లి, లక్షెట్టిపేట, సీసీసీనస్పూర్‌, తాండూర్‌, కన్నెపల్లితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహించారు.