గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి

మందమర్రి/హజీపూర్/మంచిర్యాల కల్చరల్/ మందమర్రి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వేంకటేశ్వర ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువ జామునే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం సిద్ధమవుతున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. ఇక్కడకి మన జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ జిల్లా నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. గూడెం సమీపంలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని, సత్యనారాయణ వ్రతాలను కూడా ఆచరిస్తారు. మందమర్రిలోని శ్రీవెంకటేశ్వర ఆలయం ముస్తాబైంది. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, ఆయన తనయుడు నర్సింహాచార్యులు భారీ ఏర్పాట్లు చేశారు.
దేవతామూర్తులు ఉత్తర ద్వారా దర్శనం కానున్నందున స్వామి వారు కొలువుదీరేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి ఉత్తర ద్వార దర్శన ప్రారంభ పూజలో సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ దంపతులు పాల్గొననున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. పట్టణాలు, గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానుండడంతో తొక్కిసలాటలు, ఇబ్బందులు కలుగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఈవో రవి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మందమర్రి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల ఏర్పాట్లను గురువారం స్థానిక నాయకులు, పూజారులతో కలిసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరిశీలించా రు. అనంతరం వివరాల గురించి ఆలయ ప్రధాన అర్చకుడు గోవర్ధనగిరి అనంతాచార్యులును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ వేల్పుల రవి, టీబీజీకేఎస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడిపల్లి సంపత్, గుడ్ల రమేశ్ ఉన్నారు.
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యము
ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు వైకుంఠ ద్వారం నుంచి లోనికి ప్రవేశించి ఒక్క క్షణం స్వామివారలను చూసినట్లయితే కోటియజ్ఙ ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలో వివరించబడినట్లు పండితులు చెబుతున్నారు. అసురుల హింసలకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మకడకేతెంచి బాధలు వివరించి నివారింపమని కోరతారు. బ్రహ్మవారిని ఓదార్చి ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి ప్రభాతకాలంలో వైకుంఠ పురమునకేతెంచి, వైకుంఠ నగరపు ఉత్తర ద్వారం వద్ద నిలువగా వందిమాగధుల సుప్రభాతంతో, సనక సనందాది ఋషివర్యుల స్తుతులతో ద్వారపాలకులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా వైకుంఠద్వారం తెరవగా శ్రీవారు శేషతల్పముపై వపళించి, లక్ష్మీదేవి పాదాలు పట్టుచుండగా, కోటి సూర్యతేజోమూర్తియైన స్వామివారిని చూసిన దేవతలు “పశ్యన్ నిముషమాత్రేనా కోటి యజ్ఙ ఫలం లభేత్” అని అనుకున్నారు. అనగా స్వామిని ఉత్తర ద్వారం నుండి “ఒక్కక్షణం చూసినంతనే కోటి యజ్ఙాలు చేసిన ఫలితం లభిస్తుందనీ”బ్రహ్మండ పురాణంలో వివరించబడినది.
తాజావార్తలు
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్కు ఐదో స్థానం
- సంపూర్ణేశ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్