శనివారం 16 జనవరి 2021
Mancherial - Dec 24, 2020 , 00:14:56

భగ్గుమన్న బొగ్గు కార్మికులు

భగ్గుమన్న బొగ్గు కార్మికులు

  • సింగరేణి ఆవిర్భావం సందర్భంగా తప్పుడు కథనంపై టీబీజీకేఎస్‌ నాయకుల మండిపాటు
  • నస్పూర్‌కాలనీ, మందమర్రిలో ఓ పత్రిక ప్రతుల దహనం

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌) /మందమర్రి రూరల్‌: సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ పత్రికలో వచ్చిన తప్పుడు కథనంపై కార్మికులు భగ్గుమన్నారు. నస్పూర్‌ కాలనీ, మందమర్రిలో  బుధవారం టీబీజీకేఎస్‌ నాయకులు పత్రిక ప్రతులను ద హనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత  ఇప్పటివరకు 6500 మంది కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు వచ్చాయన్నా రు. కార్మికులకు లాభాల వాటా, ఇంక్రిమెంట్‌, రూ. 10 లక్షల గృహ రుణాలు, అనేక హక్కులు సాధించామన్నారు. కార్మికులు 50 నుంచి 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీసుకెళ్లారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర చర్చల ప్రతినిధి వీరభద్రయ్య, ఏరియా చర్చల ప్రతినిధి కుమారస్వామి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, తొంగల రమేశ్‌, పిట్‌ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మహేందర్‌రెడ్డి, నాయకులు సమ్మయ్య, సుధాకర్‌,  భాస్కర్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, తిరుపతిరెడ్డి, సదానందం, సంపత్‌యాదవ్‌, చంద్రమౌళి, వెంకట్‌రెడ్డి , మందమర్రి ఏరి యా టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, సీనియర్‌ నాయకుడు జే. రవీందర్‌, అన్ని గనుల పిట్‌ కార్యదర్శులు, కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.