శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Dec 23, 2020 , 01:39:27

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

మంచిర్యాలటౌన్‌ (శ్రీరాంపూర్‌) : ప్రతి కాలనీలో కార్మిక కుటుంబాలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఐపీఎస్‌ అధికారి అశోక్‌కుమార్‌ సూచించారు. నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూనాగార్జున కాలనీలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను మంగళవారం ఐపీఎస్‌ ఆఫీసర్‌ అశోక్‌కుమార్‌, సీఐ కుమారస్వామి ప్రారంభించారు. నస్పూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ తోట శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, నాయకులు కొలిపాక సమ్మయ్య, గోపాల్‌రెడ్డి, మధు, చారి, రమేశ్‌, అశోక్‌, నీలం సదయ్య, రొడ్డ రాజే శం, ఎస్‌ఐ టీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.