సోమవారం 25 జనవరి 2021
Mancherial - Dec 23, 2020 , 01:39:03

తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి

తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి

జైపూర్‌ : ఓపెన్‌కాస్ట్ట్‌ గనిలో బ్లాస్టింగ్‌ చేసేటప్పుడు పటిష్టమైన భద్రతా చర్య లు తీసుకోవాలని డీఎంఎస్‌ మైనింగ్‌ నియోజి సూచించారు. మంగళవారం శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఇందారం ఓపెన్‌కాస్టు గనిని ఎస్సార్పీ జీఎం లక్ష్మీనారాయణతో కలిసి సందర్శించారు. ఈ సం దర్భంగా ఓసీ ప్రదేశాన్ని అధికారులతో కలిసి తిరిగి పరిశీలించారు. అనంతరం అధికారులకు రక్షణకు సంబంధించి పలు సూ చనలు చేశారు. ఉపరితల గనిలో డంపుయార్డును పరిశీలించారు. రక్షణ కమిటీ సభ్యులతో పీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాస్‌, ఏరియా సేఫ్టీ అధికారి గుప్తా, ఐకే ఓసీ ప్రాజెక్ట్‌ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్‌ ఉమాకాంత్‌ పాల్గొన్నారు. logo