మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Dec 21, 2020 , 00:24:14

ఎమ్మెల్సీ కవితకు వినతి

ఎమ్మెల్సీ కవితకు వినతి

కోటపల్లి :  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలని, పీఆర్సీ పెంపు, ఇతర సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చినట్లు సీఆర్టీల సంఘం యూనియన్‌ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు వినంత్‌ రావ్‌, జనరల్‌ సెక్రటరీ  శ్రీనివాస్‌, మంచిర్యాల జిల్లా నాయకులు చడెంక బాపురావు, గుగ్లోత్‌ మల్లేశ్‌, బద్ది శ్రీనివాస్‌, కొమిరెళ్లి శంకర్‌, బానోత్‌ సరోజ, రమాదేవి పాల్గొన్నారు.