ఆదివారం 17 జనవరి 2021
Mancherial - Dec 21, 2020 , 00:24:14

టీఎన్జీవో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

టీఎన్జీవో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

హాజీపూర్‌ : మంచిర్యాల జిల్లా తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సం ఘం (టీఎన్జీవో) అధ్యక్షుడి ఎన్నికకు ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ సంద అశోక్‌ సంఘం కార్యాలయంలో ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27 మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడితో పాటు కార్యవర్గ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో పొటీ చేసే అభ్యర్థులు జిల్లాలోని ఏదైనా యూనిట్‌ కార్యవర్గంలో మూడేళ్లు పని చేసిన అనుభవం కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితాను ఈ నెల 22 న జిల్లా కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచుతామన్నారు. 27 న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీతో పాటు కార్యవర్గం ఎన్నిక ఉంటుందని తెలిపారు.  జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, తదితరులున్నారు.