ఆదివారం 17 జనవరి 2021
Mancherial - Dec 20, 2020 , 00:07:20

మార్కెట్‌ కమిటీలు ఖరారు

మార్కెట్‌ కమిటీలు ఖరారు

  • మంచిర్యాల, చెన్నూర్‌, లక్షెట్టిపేట మార్కెట్లలో నియామకం పూర్తి
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • విప్‌ సుమన్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు చొరవతో పూర్తయిన ప్రక్రియ
  • ఆయా చోట్ల శ్రేణుల సంబురాలు

మంచిర్యాల జిల్లాలోని మూడు మార్కెట్‌ కమిటీలను ఖరారు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పల్లె భూమేశ్‌, చెన్నూర్‌ మార్కెట్‌ చైర్మన్‌గా బత్తుల సమ్మయ్య, లక్షెట్టిపేట మార్కెట్‌ చైర్‌పర్సన్‌గా సంధ్యారాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018లోనే పదవీకాలం ముగియగా, వరుస ఎన్నికలు, కొవిడ్‌ నేపథ్యంలో ఎంపిక ఆలస్యమైంది. ప్రభుత్వ విప్‌, బాల్క సుమన్‌, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చొరవతో ఈ ప్రక్రియ పూర్తికాగా, ఆయా చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి.

- మంచిర్యాల, నమస్తే తెలంగాణ

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లాలోని మూడు మార్కెట్‌ కమిటీలను ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఆయా కమిటీలకు  పదవీకాలం పూర్తయ్యింది. ఎన్నికలు, కొవిడ్‌ నేపథ్యంలో ఆ కమిటీల ఎంపికలో ఆలస్యమైంది. 

మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పల్లె భూమేశ్‌.. 


మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పల్లె భూమేశ్‌ను నియమించారు. వైస్‌ చైర్మన్‌గా గోపతి లస్మయ్య, సభ్యులుగా అంకం లక్ష్మి, తో కల సురేశ్‌, తిప్పని తిరుపతి, గరిసె భీమయ్య, పెంద్రం ప్రభాకర్‌, సాబీర్‌ అలీ, అశోక్‌కుమార్‌ లడ్డా, కొత్త సురేందర్‌ను ఎంపిక చేశారు. 

లక్షెట్టిపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సంధ్యారాణి.. 


లక్షెట్టిపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కేతిరెడ్డి సంధార్యాణిని ఎంపిక చేశారు. వైస్‌చైర్మన్‌గా రేణి శ్రీనివాస్‌, సభ్యులుగా గాలిపెల్లి సత్యనారాయణ, గడికొప్పుల సతీశ్‌, బొలిశెట్టి రమేశ్‌, గొడిశెల రాజేశం, కుర్సింగ కమలాకర్‌, మిరాజ్‌ అస్రఫ్‌ బేగ్‌, పాలకుర్తి లచ్చన్న, నరేంద్రుల సుదర్శన్‌ను నియమించారు.

చెన్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బత్తుల సమ్మయ్య...


చెన్నూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బత్తుల సమ్మయ్యను నియమించగా, వైస్‌ చైర్మన్‌గా ఆర్నె సమ్మయ్య, సభ్యులుగా మెండె హేమలత, గుండా భాస్కర్‌రెడ్డి, దుర్గం వెంకటస్వామి, భూక్యా రాజ్‌కుమార్‌, పోతు భాస్కర్‌రెడ్డి, ఎండీ నజీముద్దీన్‌, జూలూరి మనోహర్‌, విజయ్‌కుమార్‌ బజాజ్‌ నియమితులయ్యారు.