బుధవారం 27 జనవరి 2021
Mancherial - Dec 20, 2020 , 00:07:55

పబ్లిక్‌ టాయిలెట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

పబ్లిక్‌ టాయిలెట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ రైల్వేగేటు, ఐబీ చౌరస్తాలో బీవోటీ విధానంలో నిర్మించిన రెండు పబ్లిక్‌ టాయిలెట్లను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే దివాకర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించిన మేరకు మంచిర్యాలలో బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో వీటిని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, కమిషనర్‌ స్వరూపారాణి, టీపీవో సత్యనారాయణ, కౌన్సిలర్లు మహేశ్వరి, పద్మ, హరికృష్ణ, సురేశ్‌బల్దవా, టీఆర్‌ఎస్‌ నాయకులు పల్లె భూమేశ్‌, గోగుల రవీందర్‌రెడ్డి, గౌసొద్దీన్‌, వదూద్‌, అశోక్‌తేజ, సంజీవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

పారిశుధ్య పనులు పరిశీలన..మంచిర్యాలలోని ఐబీ చౌరస్తానుంచి సున్నంబట్టి వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా పారిశుధ్య పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావు పరిశీలించారు. పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఆయన వెంట చైర్మన్‌ పెంట రాజయ్య, కమిషనర్‌ స్వరూపారాణి, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. logo