ఆదివారం 17 జనవరి 2021
Mancherial - Dec 20, 2020 , 00:08:44

స్వేరో సర్కిల్‌ కేంద్రాలు విద్యార్థులకు వరం

స్వేరో సర్కిల్‌ కేంద్రాలు విద్యార్థులకు వరం

  •  రాష్ట్ర అధ్యక్షుడు మంద శ్యామ్‌

మంచిర్యాల, అగ్రికల్చర్‌ :స్వేరో సర్కిల్‌ కేంద్రాలు విద్యార్థులకు వరమని స్వేరో సర్కిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంద శ్యామ్‌ పేర్కొన్నారు. ‘జ్ఞానమే మన ధర్మం.. విజ్ఞానమే మా గమ్యం..’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్వేరో జ్ఞానయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నది. రాష్ట్ర అధ్యక్షుడు మంద శ్యామ్‌కు స్వేరో సర్కిల్‌, అనుబంధ సంఘాల నాయకులు శనివారం ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అనంతరం జిల్లాలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్‌, మంచిర్యాల మండలాల్లో స్వేరో సర్కిల్‌ నిర్వహిస్తున్న కమాండర్స్‌ రాజేశ్వరి, పావని, మేఘన, అమూల్యను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వేరో సర్కిల్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు తీగల శ్రీనివాస్‌, టీజీపీఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజ్మీరా సంపత్‌నాయక్‌, జిల్లా నాయకులు జాడి రాజన్న, కార్తీక్‌, కర్రె రాజేశ్వర్‌, కరాటే రాయమల్లు, ఎర్రం సుధాకర్‌, బెజ్జూరి రమేశ్‌, తులసీరాం, తదితరులు పాల్గొన్నారు.