సోమవారం 25 జనవరి 2021
Mancherial - Dec 17, 2020 , 01:43:15

విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సు

విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల నుంచి విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సు సేవలను మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ మేకల మల్లేశయ్య బుధవారం ప్రారంభించారు. గతంలోనూ విజయవాడకు మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సు నడిచిందని, కరోనా నేపథ్యంలో ఈ సేవలను నిలిపివేశామని పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి ఈ సర్వీసు సేవలను ప్రారంభిస్తున్నామన్నా రు. ప్రతి రోజూ మంచిర్యాల నుంచి 12.50 గంటలకు ప్రారంభమై హైదరాబాద్‌ మీదుగా విజయవాడ చేరుకుంటుందని, తిరిగి రాత్రి 12 గంటలకు విజయవాడ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏడీఎం శ్రీలత, శ్రీనివాస్‌, డ్రైవ ర్లు, క్లీనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.logo