ఆదివారం 24 జనవరి 2021
Mancherial - Dec 17, 2020 , 01:43:57

ప్యాడీ క్లీనర్లతో రైతులకు మేలు

ప్యాడీ క్లీనర్లతో రైతులకు మేలు

  • మంచిర్యాల కలెక్టర్‌  భారతీ హోళికేరి
  • జిల్లాకు వచ్చిన ప్యాడీ క్లీనర్ల ప్రారంభం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ప్యాడీ క్లీనర్లతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు తెప్పించిన 24 ప్యాడీ క్లీనర్లను బు ధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగి పంట చేతికి వచ్చే నాటికి జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ క్లీనర్లు తెప్పించాలని ఆయా ఏజెన్సీలను ఆదేశించామన్నారు. ఇందు లో భాగంగా ఇప్పటికే జిల్లా సహకార అధికారి 15 పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో నడిచే ప్యాడీ సెంటర్లకు వాటిని తీసుకవచ్చారని తెలిపారు. అలాగే మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 50 ప్యాడీ క్లీనర్లకు ఆర్డర్‌ ఇవ్వగా, ప్రస్తుతం 24 వచ్చినట్లు చెప్పారు. మిగతావి మరో పది రోజుల్లో రానున్నట్లు వెల్లడించారు. 

వీటి ద్వారా నాణ్యమైన ధాన్యం బయటకు వస్తుందని, దీంతో ఎలాంటి కోతలు ఉండవన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీటిని ఉపయోగించేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వీ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ డీఎం జీ గోపాల్‌, డీఆర్డీఏ పీడీ శేషాద్రి, జిల్లా సహకార అధికారి బీ సంజీవ రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, డీపీఏ అన్వేశ్‌, డీఈవో సతీశ్‌ కుమార్‌, డీసీఎంఎస్‌ ఇన్‌చార్జి సంతోష్‌, మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo