సంక్షేమ పథకాలు స్ఫూర్తిదాయకం

- పాడి రైతులకు ఆర్థికంగా మేలు
- మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
- పడ్తన్‌పల్లిలో కరీంనగర్ డెయిరీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ప్రారంభం
హాజీపూర్ : కరీంనగర్ డెయిరీ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాడి రైతులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు స్ఫూర్తిదాయకమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. హాజీపూర్ మండలం పడ్తన్‌పల్లి గ్రామ శివారులో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల పాడి రైతులకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్క రైతు ఆవులు, బర్రెలను పెంచుకోవడం వల్ల ఆర్థికంగా ఎదుగవచ్చని తెలిపారు. పాడి రైతుల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కరీంనగర్ డెయిరీ సంస్థను అభినందించారు. అనంతరం కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ..
పాడి రైతుల భాగస్వామ్యంతో పాల ఉత్పత్తిలో వచ్చే లాభంలోని ప్రతి రూపాయి రైతులకు చెందుతుందన్నారు. ఈ డెయిరీ సంస్థలోని 23 సంక్షేమ పథకాలు పాడి రైతులకు అందినప్పుడు ఆర్థికంగా ముందుకెళ్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, బర్రెలకు ఉచిత నట్టల నివారణ మాత్రల పంపిణీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోళ్ల శ్రీనివాస్, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, రైతు బంధు సమితి కన్వీనర్ శ్రీనివాస్ రావు, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, సింగిల్ విండో చైర్మెన్ మల్రాజు రామారావు, కరీంనగర్ డెయిరీ సభ్యులు శంకర్ రెడ్డి, ప్రభాకర్, రాజశేఖర్, యూనిట్ ఇన్చార్జి లక్ష్మీపతి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎత్తు పెరిగేందుకు సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?
- అల్లు అర్జున్ కారుని ఆపిన గిరిజనులు..!
- ఐపీఎల్ టీమ్స్.. ఎవరు ఉన్నారు? ఎవరిని వదిలేశారు?
- సోనుసూద్ కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం