గురువారం 21 జనవరి 2021
Mancherial - Dec 16, 2020 , 02:10:07

చిన్నారి చికిత్సకు సాయం

చిన్నారి చికిత్సకు సాయం

మందమర్రి : ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ దాతల నుంచి సేకరిం చిన రూ.30వేల చెక్కును మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ వర్షశ్రీ తల్లిదండ్రులకు అందించారు. మంగళవారం మందమర్రి జీఎం కార్యాలయంలో మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ చెన్నూరులోని జెండావాడకు చెందిన ఒద్ది నరేశ్‌-స్నేహల మూడేళ్ల కూతురు వర్షశ్రీకి రక్తంలో ఇన్ఫెక్షన్‌ సోకి ఊపి రితిత్తుల్లో నీరు చేరడం వల్ల మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని రేయిన్‌బో దవాఖానకు పంపించారు. నరేశ్‌ది పేద కుటుంబం. దీంతో  ‘మేము సైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దాతల నుంచి రూ. 30 వేలు సేకరించి జీఎం చింతల శ్రీనివాస్‌ చేతుల మీదుగా వర్షశ్రీ  తల్లి దండ్రులకు చెక్కును అందించారు. సభ్యులను జీఎం అభినందిం చా రు. సభ్యులు పత్తిపాక శ్రీనివాస్‌, బిరుదు సత్యం, ఈర్లపాటి సోమ య్య, జక్కని సత్యనారాయణ, చంద్రకాంత్‌, వడ్ల రవి పాల్గొన్నారు.  logo