మత్స్యకారుల అభ్యున్నతికి కృషి

- మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
- గోదావరిలో రొయ్య పిల్లల విడుదల
- కుమ్రం భీం ప్రాజెక్ట్‌లో వదిలిన జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు
లక్షెట్టిపేట రూరల్: మత్స్యకారుల అభ్యున్నతి కి రా ష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే న డిపెల్లి దివాకర్ రావు అన్నారు. మండలంలోని గుల్లకోట గ్రామం వద్ద గోదావరిలో నాలుగు లక్షల అరవై మూడు వేల రొయ్య పిల్లలను శనివారం ఆయన స్థానిక నాయకు లతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. గోదావరి పరీవాహక ప్రాంతాల మత్స్య కా ర కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు యేటా లక్షలా ది చేపపిల్లలను వదిలామని, ఈ సారి మాత్రం రొయ్య పి ల్లలను వదిలామన్నారు. దీనిద్వారా దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు చుం చు చిన్నన్న, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గొల్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, ఎంపీటీసీ కల్లు దావిద్, కే సత్తయ్య, రాజిరెడ్డి, గంగుల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తున్న దని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ ల క్ష్మి అన్నారు. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కుమ్రం భీం(అడ) ప్రాజెక్టులో 5.40 లక్షల రొయ్య పిల్లలను కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో రొయ్య పిల్లలను అందజేసినట్లు తెలిపారు. జిల్లా మత్స్య శాఖ అధికారి సాంబశివరావు, ఆసిఫాబా ద్ జడ్పీటీసీ నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ యా దవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, తదితరులున్నారు.
తాజావార్తలు
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
- బాలికపై బ్యాంకు మేనేజర్ అత్యాచారం..!
- ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్
- ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి హరీశ్ రావు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
- హల్దీ వేడుకల్లో వరుణ్ ధావన్ హల్చల్
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- విజయవంతంగా ఆకాశ్-NG క్షిపణి పరీక్ష