శనివారం 16 జనవరి 2021
Mancherial - Dec 12, 2020 , 01:47:51

పునరావాసకాలనీ సమస్యల పరిష్కారానికి కృషి

పునరావాసకాలనీ సమస్యల పరిష్కారానికి కృషి

  • ఎమ్మెల్యే దివాకర్‌రావు

సీసీసీ నస్పూర్‌ : సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ప్రభావిత సింగాపూర్‌ పునరావాసకాలనీలో  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దివాకర్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం నస్పూర్‌ మున్సిపాలిటి పరిధిలోని సింగాపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సింగరేణి నిధులు రూ.15 లక్షలతో చేపడుతున్న హనుమాన్‌ ఆలయ నిర్మాణ స్లాబ్‌ పనులను ఆయన ప్రారంభించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. పునరావాసకాలనీలో మిగిలిపోయిన పనులను సింగరేణి యజమాన్యంతో మాట్లాడి వేగవంతంగా పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్‌ చీడం మహేశ్‌, కో ఆప్షన్‌ సభ్యులు పెరుమాళ్ల భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు మల్లెత్తుల రాజేంద్రపాణి, గుంట జగ్గయ్య, నాయకులు హైమద్‌, జనార్దన్‌, ఆకునూరి సంపత్‌కుమార్‌, అక్కూరి సుబ్బయ్య, రుకుం తిరుమల్‌, వడ్లూరి పోషమల్లు, కుర్మిళ్ల మోహన్‌, పంబాల ఎర్రయ్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.