మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Dec 11, 2020 , 03:20:47

దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేసుకోవాలి

కాసిపేట : మండలంలోని ముత్యంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌, పదో తరగతి ప్రవే శానికి దరఖాస్తు చేసుకోవాలని కోఆర్డినేటర్‌ రాథోడ్‌ రమేశ్‌ పేర్కొన్నారు. మీ సేవ, ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, అడ్మిషన్‌ ఫీజుల చెల్లించి తిరిగి పత్రాలను పాఠశాలలో అందించి అడ్మిషన్‌ పొం దాలని సూచించారు. జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటర్‌కు టెన్త్‌ మెమో, కులం, ఆధార్‌ పత్రాలతో పాటు ఫొటోలు, పదో తరగతికి టీసీ, కులం, ఆధార్‌, ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ మీడియంతో పాటు అన్ని గ్రూప్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ముత్యంపల్లి పాఠశాలలో సంప్రదించాలని, 863964 8877, 8693049174 నంబర్లలో సంప్రదించవచ్చ ని రమేశ్‌ సూచించారు.