శనివారం 23 జనవరి 2021
Mancherial - Dec 11, 2020 , 03:20:47

రేపు కన్సల్టెటివ్‌ సేఫ్టీ కమిటీ సమావేశాలు

రేపు కన్సల్టెటివ్‌ సేఫ్టీ కమిటీ సమావేశాలు

  •  టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌) : మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని గనుల్లో చేపడుతున్న రక్షణ తీరు తెన్నులను చర్చించేందు కు ఈ నెల 12న శనివారం శ్రీరాంపూర్‌ సిం గరేణి అతిథి గృహంలో పార్లమెంటరీ స్థాయి కన్సల్టేటివ్‌ సేఫ్టీ కమిటీ సమావేశాలు జరుగనున్నాయని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న జిల్లాలోని ఆయా ఏరియాల జీఎంలు, నలుగురు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ(డీడీఎంఎస్‌), సింగరేణి ఉన్నతాధికారులు, టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఎంపీ వెంకటేశ్‌ నేత కాని, ఎమ్మెల్యేలు ము ఖ్య అతిధిగా పాల్గొననున్నారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు గోదావరిఖనిలో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు జరుగుతాయని చెప్పారు.

దీనికి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని హాజ రు అవుతారని పేర్కొన్నారు. ఏరియా  స్థాయి లో సేఫ్టీ ట్రైపార్టియేట్‌ సమావేశాలు ఈ నెల 25న జరుగుతాయని చెప్పారు. 30లోగా అన్ని ఏరియాల సేఫ్టీ కమిటీ సమావేశాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. మెడికల్‌ బోర్డులు ఆలస్యంగా నిర్వహిస్తున్నందున అన్‌ఫిట్‌ అయిన కార్మికుల పిల్లలకు వయస్సుతో సంబంధం లేకుండా కారుణ్య ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎలాంటి కండీషన్లు లేకుండా దివ్యాంగుల కోటాపై ఉద్యోగాలు కల్పించాలని, దీనిపై ఈ నెల 21, 22న కొత్తగూడెంలో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డీ అన్నయ్య, కేం ద్ర చర్చల ప్రతినిధి కే వీరభద్రయ్య, రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి పాల్గొన్నారు. logo